Priyanka Chopra Visits Hyderabad’s Chilkur Balaji Temple | ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ( Priyanka Chopra ) ఇటీవలే అమెరికా లోని లాస్ ఏంజెలెస్ ( Los Angeles ) నుండి హైదరాబాద్ కు వచ్చిన విషయం తెల్సిందే.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆమె హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేశారు. న్యూ జర్నీ ( New Journey )ని మొదలుపెడుతున్నట్లు పేర్కొన్నారు.
అయితే నూతన ప్రయాణం దేనికోసమో అనేది మాత్రం చెప్పలేదు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu )- దర్శకధీరుడు రాజమౌళి ( Rajamouli ) కాంబోలో నూతన చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ప్రియాంక చోప్రా కూడా ఈ మూవీలో నటిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.
షూటింగ్ కోసమే ఆమె అమెరికా నుండి హైదరాబాద్ కు చేరుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. న్యూ జర్నీ అనేది కూడా SSMB29 కి సంబంధించినదే కావొచ్చని పలువురు కామెంట్లు పెడుతున్నారు.