Seva Ratna For Srinivas Chary | అనేక దీర్ఘకాలిక వ్యాధులకు అత్యాధునిక చికిత్స అందిస్తున్న కేబీకే హాస్పిటల్ ఖాతాలో మరో అరుదైన గౌరవం వచ్చి చేరింది. హాస్పిటల్ డైరక్టర్ శ్రీనివాస చారికి సేవారత్న పురస్కారం లభించింది.
నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ కమ్యూనల్ హార్మొని 45వ వార్షికోత్సవం సందర్భంగా ముంబై కేంద్రంగా పనిచేసే అసనాజ్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ హెల్త్ కేర్ విభాగంలో శ్రీనివాస చారికి భారత్ గౌరవ్ శ్రీ హెచ్.హెచ్. అల్హజ్ అసద్ బాబా మెమోరియల్ సేవారత్న అవార్డు ప్రదానం చేసింది.
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆరోగ్య విభాగంలో శ్రీనివాస చారి నేతృత్వంలో జరుగుతున్న కార్యక్రమాలను నిర్వాహకులు కొనియాడారు. శ్రీనివాస చారితోపాటు వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న పలువురు విభిన్న అవార్డులు అందుకున్నారు.
కేబీకే హాస్పిటల్ డైరెక్టర్ గా శ్రీనివాస చారి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో పలు అరుదైన దీర్ఘకాలిక వ్యాధులకు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు. ఏటా కొన్ని వేల సంఖ్యలో ఆంప్యుటేషన్స్ కు కారణమవుతున్న గ్యాంగ్రీన్, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్, సెల్యూలైటిస్, క్రానిక్ వూండ్స్ తదితర సమస్యలకు శరీర భాగాలు తొలగించకుండానే పూర్తిగా నయం చేస్తున్నారు.