Thursday 24th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > హిందీ మాకొద్దు అంటే ఎలా?..పవన్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్

హిందీ మాకొద్దు అంటే ఎలా?..పవన్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్

Prakash Raj Counter To DY CM Pawan Kalyan Over Hindi Language Controversy | జనసేన జయకేతనం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నటుడు ప్రకాశ్ రాజ్.

జనసేన 12వ ఆవిర్భావ సభలో భాగంగా పవన్ మాట్లాడుతూ..’ సంస్కృతాన్ని తిడతారు, దక్షిణాదిన హిందీని రుద్దవద్దు అని అంటారు..కానీ అన్నీ దేశ భాషలే కదా’ అంటూ తమిళనాడును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమిళనాడులోకి హిందు రావొద్దు అని అంటున్నారని అలాంటప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి డబ్ ( Dub ) చేయకూడదని సూచించారు.

హిందీ వాళ్ళ డబ్బులు కావాలి కానీ వారి భాషను వద్దంటే ఎలా అని పవన్ ప్రశ్నించారు. దేశ భాషాల్ని ద్వేషిస్తే ఎలా అని జనసేనాని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.

“మీ హిందీ భాషను మా మీద రుద్దకండి”, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు అని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం”, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ఆయన కోరారు.

You may also like
చైనా లో ‘గోల్డ్ ఏటీఎం’..30 నిమిషాల్లో బ్యాంకులోకి నగదు
‘నన్ను మోసం చేశాడు..పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పదేళ్ల బాలుడు’
‘జమ్మూలో పర్యాటకులపై ఉగ్రదాడి’
‘రూ.2.5 కోట్లు మనీ లాండరింగ్..మహేష్ బాబుకు ఈడీ నోటీసులు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions