Thursday 21st November 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘రాహుల్ గాంధీ నిర్ణయాన్ని ఎవరూ ఆపలేరు’

‘రాహుల్ గాంధీ నిర్ణయాన్ని ఎవరూ ఆపలేరు’

ponnam prabhakar
  • తెలంగాణలో కులగణన బ్రహ్మాండంగా జరుగుతోంది
  • దేశానికి దిశాదశగా తెలంగాణ
  • బీజేపీ, బీఆర్ఎస్ లది దుష్ప్రచారం మాత్రమే
  • మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం

Minister Ponnam Prabhakar In Maharashtra | మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) ప్రచారంలో భాగంగా తెలంగాణ మంత్రి సీతక్క, మంత్రి పొన్న ప్రభాకర్ సోమవారం ఛంద్రపూర్  జిల్లా రాజుర ఎన్నికల సభలో పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రాహుల్ గాంధీ చెప్పినట్లుగా ఈ దేశంలో ఎవరు అడ్డుపడినా కుల గణన జరిగి తీరుతుందన్నారు. గడ్కరీ, నరేంద్ర మోదీ ఎవరూ ఆపలేరని తెలిపారు. రేవంత్ రెడ్డి  నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కుల గణన అంశంపై దేశానికి దిశా దశగా నిలుస్తోందన్నారు.

కులగణన పై క్యాబినెట్ లో తీర్మానం చేశాం. అసెంబ్లీలో తీర్మానం చేశాo. ప్లానింగ్ శాఖ ద్వారా కుల గణన విజయవంతంగా నిర్వహిస్తున్నo. ఇప్పటికీ 50 శాతానికి పైగా సర్వే పూర్తయింది.

ప్రజలే ముందుకు వచ్చి సర్వేలో తమ వివరాలు నమోదు చేయించుకుంటున్నారు. ఎన్యుమరేటెర్స్ ను ఇంటికి ఆహ్వానించి మరీ వివరాలు ఇస్తున్నారు. ప్రజలంతా సహకరిస్తుంటే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ, బీఆర్ఎస్ వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఐక్యం చేసే పార్టీ. దేశ ప్రజలను ఐక్యంగా ఉంచేందుకు తన త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ది.

స్వతంత్ర పోరాటంలో స్వతంత్ర భారతదేశంలో త్యాగాలు చేసింది కాంగ్రెస్ నేతలే. రాజుర నియోజకవర్గంలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలుస్తోంది.

రాహుల్ గాంధీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ కూటమి కుల గణన చేపడుతోంది. జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు సంక్షేమ ఫలాలు అందిస్తాం. అందుకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందజేస్తుంది.

బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా అసెంబ్లీలో నేను ప్రతిపాదిస్తే సభ ఏకగ్రీవంగా కులదరణ తీర్మానాన్ని ఆమోదించింది.

1.17 కోట్ల కుటుంబాల వివరాలను 87 వేల ఏన్యుమరేటర్లు సేకరిస్తున్నారు. ఒక్కో ఎన్ని మారేటర్ 150 ఇండ్ల వివరాలను సేకరిస్తున్నారు. కుల గణన చేపట్టే వారిని తన్ని తరిమేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్గారి అహంకారంతో మాట్లాడుతున్నారు.

ప్రజలు ఎవరిని తల్లి తరిమేస్తారో మహారాష్ట్ర ఎన్నికల్లో తేలిపోతుంది. తెలంగాణలో కుల గణన మొదలుపెడితే మోడీ ప్రభుత్వం వణికి పోతుంది. కుల గణన ప్రజలను చీల్చడానికి కాదు. వాటాగా సంక్షేమ ఫలాలు రిజర్వేషన్లు దక్కని వర్గాల కోసమే ఈ సర్వే.

రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈ సర్వే చేస్తున్నాం. కుల గణన లతో వనికిపోయిన బిజెపి నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

ఆర్ఎస్ఎస్ వాళ్లు కులగలను వ్యతిరేకిస్తూ ఎన్నో ప్రసంగాలు చేశారు. సామాజిక న్యాయాన్ని కాంక్షించే బిజెపి నేతలు బయటకు రండి. మేమెంతో మాకు అంత నిజం చేసుకోవడానికి బిజెపి నాయకత్వాన్ని ప్రశ్నించండి.  మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

You may also like
rahul gandhi
అమెరికాలో ‘తెలుగు భాష’ పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
bjp mp raghunandan rao
రాహుల్ గాంధీతో ఉన్న అమ్మాయెవరు: బీజేపీ ఎంపీ
rahul gandhi
పెళ్లిపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rahul Modi
వారణాసి యువత తాగి పడిపోతున్నారా? రాహుల్ కు మోదీ చురకలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions