Police Case Registered Against Daggubati Family | టాలీవుడ్ ( Tollywood ) అగ్ర నిర్మాత సురేష్ బాబు ( Suresh Babu ), నటులు వెంకటేష్ ( Venkatesh ), రానా ( Daggubati Rana )లపై ఫిల్మ్ నగర్ పోలీసులు కేసును నమోదు చేశారు.
ఫిల్మ్ నగర్ లోని దక్కన్ కిచెన్ కూల్చివేత అంశంలో 448, 452, 458, 120బి సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో వార్తల్లోకి ఎక్కిన నందకుమార్ కు చెందిన దక్కన్ కిచెన్ కు సంబంధించి దగ్గుబాటి ఫ్యామిలీతో స్థల వివాదం చెలరేగింది.
ఈ క్రమంలో నందకుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. 2022 నవంబర్ లో జిహెచ్ఎంసీ ( GHMC ) అధికారులు, బౌన్సర్ల సహాయంతో దక్కన్ కిచెన్ హోటల్ ను పాక్షికంగా కూల్చేశారు.
ఈ నేపథ్యంలో యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ 2024 జనవరిలో హోటల్ ను పూర్తిగా కూల్చేశారు. దీనిపై నందకుమార్ కోర్టును ఆశ్రయించారు.
శనివారం విచారణ చేపట్టిన ధర్మాసనం దగ్గుబాటి కుటుంబంపై కేసును నమోదు చేసి విచారణ జరపాలని ఫిల్మ్ నగర్ ( Film Nagar ) పోలీసులకు స్పష్టం చేసింది. దింతో సురేష్ బాబు, వెంకటేష్, రానా మరియు ఏ4గా దగ్గుబాటి అభిషేక్ పై కేసు నమోదయ్యింది.









