PM Modi’s Friendly Chat With Minister Lokesh | ప్రధాని నరేంద్ర మోదీ ( Pm Modi ) బుధవారం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన విషయం తెల్సిందే.
ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu ), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) తో కలిసి విశాఖలో రోడ్ షోలో పాల్గొని అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ తో ప్రధాని జరిపిన సంభాషణ ఆసక్తిగా జరిగింది.
గ్రీన్ రూమ్ లో ప్రధానిని రాష్ట్ర మంత్రులు ఆహ్వానించారు. మంత్రులు నమస్కారం చేస్తుండగా ప్రధాని ప్రతినమస్కారం చేస్తూ ముందుకు వెళ్లారు. మంత్రి లోకేష్ దగ్గరకు రాగానే నీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది తెలుసా ? అని ప్రధాని అడిగారు.
అదేంటో మీకు కూడా తెలుసు కదా ? అని పక్కనే ఉన్న సీఎం బాబు వైపు చూశారు. ‘ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది. అయినా ఢిల్లీ వచ్చి నన్ను కలవలేదు, కుటుంబంతో వచ్చి కలవాలి’ అని ప్రధాని సూచించారు. పీఎం వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి లోకేశ్ ఖచ్చితంగా వస్తాను సర్ అని బదులిచ్చారు.