Modi About Karpuri Thakur | జన నాయక్ గా గుర్తింపు పొందిన బిహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరీ ఠాకూర్ కు కేంద్రప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం రాకూర్ శత జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి అర్పించారు.
సామాజిక న్యాయం కోసం కర్పూరి ఠాకూర్ చేసిన కృషి కోట్లాది ప్రజల జీవితాల్లో పెనుమార్పు తెచ్చిందని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ నిరాండబరతకు సంబంధించి ఓ ఆసక్తికర ఘటనను గుర్తు చేసుకున్నారు మోదీ.
“1977లో ఠాకూర్ బీహార్ సీఎం అయినప్పుడు కేంద్రంలో, బీహార్‌లో జనతా ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో జనతా పార్టీ నాయకుడు లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ జన్మదినం సందర్భంగా నాయకులు పాట్నాలో సమావేశమయ్యారు.
అందులో పాల్గొన్న సీఎం కర్పూరి బాబు కుర్తా చిరిగిపోయింది. అప్పుడు జనతాపార్టీ నేత చంద్రశేఖర్ మాట్లాడుతూ కర్పూరీ జీ కొత్త కుర్తా కొనుగోలు చేయడానికి కొంత డబ్బును విరాళంగా ఇవ్వమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కానీ కర్పూరీ ఠాకూర్ ఆ డబ్బును తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చారు” అని మోదీ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు.