PM Modi Congratulates BNP’s Tarique Rahman | బంగ్లాదేశ్ లో విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిన విషయం తెల్సిందే. షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత ఫిబ్రవరి 12న ఆ దేశంలో ఎన్నికలు జరిగాయి. రెండు దశాబ్దాలకు పైగా ప్రతిపక్షంలో కొనసాగుతున్న ‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ’ భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. రెండింట మూడవ వంతు సీట్లను ఈ పార్టీ గెలవనునట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. బీఎన్పీ ఛైర్మన్ తారిక్ రెహమాన్ ను అభినందించారు.
బంగ్లాదేశ్ ప్రజల విశ్వాసాన్ని ఈ ఫలితాలు ప్రతిభింభిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ కు భారత మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు నూతన ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. 350 స్థానాలున్న ఆ దేశ పార్లమెంటులో ఇప్పటికే బీఎన్పీ 210 స్థానాలకు పైగానే గెలిచింది. మరోవైపు మత ఛాందస్స రాజకీయాలకు పేరొందిన జమాత్-ఎ-ఇస్లామీ మరియు మిత్రపక్షాలు కలిసి 71 స్థానాలను కైవసం చేసుకున్నాయి.










