PM Modi condoles demise of Kota Srinivas Rao | విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలిపారు.
‘ కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు మరియు పేదలు మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి.’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఆదివారం సాయంత్రం సినీ ప్రముఖులు అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య కోట అంత్యక్రియలు ముగిశాయి.









