PM Modi Book On Emergency Days | మన దేశంలో ఎమర్జెన్సీ (Emergency) విధించి బుధవారం నాటికి 50 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోది (Narendra Modi) నాటి ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేసుకున్నారు.
ఎమర్జెన్సీ విధించిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వ దురాగతాలను భారతీయులెవరూ ఎన్నటికీ మర్చిపోలేరని వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ విధించిన సమయంలో తాను ఆర్ఎస్ఎస్ లో యువ ప్రచారక్ గా పనిచేస్తున్నాని తెలిపారు.
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం తనకు ఎన్నో పాఠాలు నేర్పించిందని వివరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఉద్యమం తెలిపిందని రాసుకొచ్చారు. భారత రాజ్యాంగ విలువలను పక్కన బెట్టి, ప్రాథమిక హక్కులను అణచివేసి, పత్రికా స్వేచ్ఛను కాలరాసి.. ఎంతోమంది రాజకీయ నేతలు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, సామాన్య పౌరులను జైలుకు పంపారని గుర్తి చేశారు మోదీ.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నిర్బంధానికి గురిచేసిందని మండిపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించి వారు ప్రవర్తించిన తీరును భారతీయులెవరూ ఎన్నటికీ మర్చిపోలేరని వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ రోజుల్లో తన అనుభవాలను వివరించేందుకు ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ పేరుతో ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.