Pawan Kalyan Expresses Sorrow Over Tirupati Stampede Incident | తిరుపతిలో శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం టోకెన్ల జారీ చేస్తున్న కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మరణించిన విషయం తెల్సిందే.
ఈ ఘటనపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖకు సూచించారు.
మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారని తెలిసిందని వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు చెప్పారు.
అదే విధంగా మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్ళి పరామర్శించి మనో ధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలన్నారు.