Wednesday 23rd April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పిఠాపురం ఆడపడుచులకు 12 వేల చీరలు పంచిన పవన్ కళ్యాణ్

పిఠాపురం ఆడపడుచులకు 12 వేల చీరలు పంచిన పవన్ కళ్యాణ్

 Pawan Kalyan distributes 12 Thousand Sarees | పిఠాపురం ( Pitapuram ) ఆడపడుచులకు డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) సొంత డబ్బులతో 12 వేల చీరలను, పసుపు, కుంకుమను కానుకగా అందించారు.

శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తిపీఠం శ్రీ పురూహూతిక అమ్మవారి ఆలయం ( Sri Puruhutika Devi temple )లో సంప్రదాయబద్ధంగా వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించారు.

పవన్ కళ్యాణ్ తరఫున ఆయన వదిన, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ( Nagababu ) సతీమణి పద్మజ మరియు శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ ( Pidugu Hariprasad ) వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ పసుపు, కుంకుమ, చీరలు కానుకగా అందజేశారు.

పద్మజ ప్రతి ఒక్కరికీ బొట్టు పెట్టి మరీ సారె అందచేశారు. అనంతరం సామూహిక వరలక్ష్మీ వ్రత కార్యక్రమాలు ప్రారంభించారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాల నేపధ్యంలో ఉదయం 5 గంటల నుంచే పురూహూతిక అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు.

వందాలాదిగా తరలివచ్చి భక్తి శ్రద్దలతో వ్రతమాచరించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో మూడు బ్యాచులుగా వ్రతాలు నిర్వహించే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

You may also like
జనసేన ‘జయకేతనం’..పవన్ ఏం చెప్పబోతున్నారో !
జనసేన గెలుపు..100 ఏళ్ల స్వాతంత్ర్య్ర ఉద్యమ నేత సంబరాలు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions