Monday 16th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > లా అండ్ ఆర్డర్ బాబు వద్దే.. డిప్యూటీ సీఎంగా పవన్!

లా అండ్ ఆర్డర్ బాబు వద్దే.. డిప్యూటీ సీఎంగా పవన్!

Chandrababu, Pawan Kalyan

Pawan As Deputy CM | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర నూతన కాబినెట్ ఇటీవలే కొలువుదీరిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో మంత్రులకు శుక్రవారం శాఖలు ఖరారు చేశారు.

లా అండ్ ఆర్డర్ మరియు పబ్లిక్ ఎంటర్ప్రైసెస్ శాఖను సీఎం చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు. అనూహ్యంగా వంగలపూడి అనితకు హోంమంత్రిగా బాధ్యతలు అప్పగించారు.

మానవ వనరుల అభివృద్ధి మరియు అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐటీ శాఖను నారా లోకేష్ కు కేటాయించారు. ఆర్థిక మంత్రిగా సీనియర్ నేత పయ్యావుల కేశవ్, హ్యాట్రిక్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకి నీటిపారుదల శాఖ అప్పగించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాను కల్పించారు. అంతేకాకుండా ఈ పిఠాపురం ఎమ్మెల్యేకు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం తదితర శాఖలు లభించాయి.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions