Pawan Kalyan About Hindi | తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, దేశంలోని ఇతరత్రా అన్ని మాతృ భాష మీద గౌరవం ఉంటుంది కానీ మన మాతృ భాష అమ్మైతే మన పెద్దమ్మ భాష హిందీ అని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో జరిగిన రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృ భాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మాట్లాడేందుకు మన రాజ్య భాష హిందీ ఉందని పేర్కొన్నారు.
ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ ఉన్నాం, కానీ మన దేశం మొత్తం ఈ రోజు ఏకం కావడానికి ఒక రాజ్య భాషని వెతుక్కుంటుంది, అది హిందీ అయిందన్నారు. విద్యా, వైద్యం, వ్యాపారం, ఉపాధి అవకాశాల కోసం అన్ని భాషలు, మాండలికాలు అవధులను జయించుకుంటూ వెళ్లిపోతున్నాయని, ఇలాంటి సమయంలో హిందూ ఒద్దు అనుకోవడం, వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇంకొక భాషని అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదని, కలిసి ప్రయాణం చెయ్యడమని తెలిపారు.