Pat Cummins and Travis Head Reject Rs 58 Crore Per Year Deal To Quit Cricket Australia | ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మరియు స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ కు ఐపీఎల్ కు చెందిన ఓ ఫ్రాంఛైజీ బంపర్ ఆఫర్ ను ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఇద్దరికీ చెరో రూ.58 కోట్ల చొప్పున ఆఫర్ చేసిన ఫ్రాంచైజీ ఓ కండీషన్ ను సైతం పెట్టినట్లు కథనాలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పి ఐపీఎల్ తో పాటుగా వివిధ దేశాల్లో జరిగే లీగుల్లో తమ ఫ్రాంచైజీ తరఫున మాత్రమే పాల్గొనాలని షరతు పెట్టినట్లు సమాచారం. కానీ ఈ భారీ ఆఫర్ ను కమిన్స్ మరియు హెడ్ తిరస్కరించారు.
ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడడానికే మొగ్గుచూపారు. ఇదిలా ఉండగా ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించిన ఐపీఎల్ ఫ్రాంచైజీ ఏదో అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఐపీఎల్ లో భాగంగా హెడ్ మరియు కమిన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నారు. ఇందులో భాగంగా కమిన్స్ ను రూ.18 కోట్లకు, హెడ్ ను రూ.14 కోట్లకు ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకున్న విషయం తెల్సిందే.









