Nimmala Rama Naidu News | ఆయన రాష్ట్ర మంత్రి. సంక్రాంతి కనుమ పండుగ వేళ ఆయనకు కాస్త సమయం దొరికింది.
వెంటనే స్వగ్రామంలోని వరి పొలంలోకి దిగి సామాన్య వ్యక్తిలా పని చేశారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.
కనుక పండుగ నాడు కాస్త సమయం లభించింది దింతో వెంటనే స్వగ్రామం ఆగర్తిపాలెంలో ఉన్న పొలంలోకి దిగి వరికి మందు పిచికారీ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నా… కాలేజీ అధ్యాపకుడిగా పని చేస్తున్న సమయంలో కూడా సొంత గ్రామంలో వ్యవసాయం మాత్రం తానే సొంతంగా చేస్తూ వరిలో ఎకరానికి 55 నుండి 60 బస్తాలు దిగుబడి సాధించడమే కాక ఆక్వా సాగులో కూడా మంచి ఫలితాలు సాధించినట్లు మంత్రి పేర్కొన్నారు.
మంత్రిగా సమయం దొరకని స్థితిలో సంక్రాంతి కనుమ రోజున కొంత తీరిక సమయం దొరకడంతో ఉదయాన్నే సొంతూరులో ఉన్న పొలంకు వెళ్లి పని కష్టం ఎప్పటికప్పుడు మర్చిపోకుండా రైతు కూలీలతో కలిసి వరి చేనుకు మందు స్ప్రే చేయడం నిజమైన సంతృప్తిని,ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
రైతులందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని పంట గట్టుపై నుండి కోరుకున్నట్లు మంత్రి చెప్పారు.