UPA New Name INDIA | భారతీయ జనతా పార్టీ (BJP)కి వ్యతిరేకంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దేశంలోని 26 పార్టీలు (Parties) కలిశాయి.
ఇటీవల బిహార్, పాట్నాలో జనతా దళ్(యూ) అధ్యక్షతన మొదటి సారి ప్రతిపక్ష పార్టీలు సమావేశం అయ్యాయి. అందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
తాజాగా ప్రతిపక్ష పార్టీలు మరోసారి రెండు రోజుల పాటు (సోమ, మంగళ వారం ) బెంగళూరులో సమావేశం అయ్యాయి. ఈ రెండు రోజుల సమావేశంలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
కూటమి పేరు, కమిటీ కన్వీనర్స్ (Committee Convenors) ను నియమించడం, సీట్ల పంపకాలు మొదలైన వాటిపై నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది.
అయితే ఇప్పటి వరకు ఉన్న ప్రతిపక్ష కూటమి యూపీఏ పేరు మార్చారు. ఈ తాజా 26 పార్టీల కూటమికి ‘INDIA’ (Indian National Developmental Inclusive Alliance) (భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి) నామకరణం చేసినట్లు తెలుస్తుంది.
Also Read: నేషనల్ యూత్ వాలంటీర్ స్కీం.. నెలకు రూ. 5 వేలు పొందండిలా!
ఈ ఇండియా కూటమికి కూడా యూపీఏ1, 2లకు సారథ్యం వహించిన సోనియా గాంధీనే అధ్యక్షత వహించాలని పార్టీలన్నీ ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
Also Read: Next CM NTR.. ఒంగోలులో తారక్ ఫ్లెక్సీల కలకలం!
Cong President Mallikarjun Kharge Comments| “బీజేపీ 2019లో జరిగిన ఎన్నికల్లో 303 సీట్లు తన మిత్రుల సహకారంతోనే గెలిచిందని” కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ట్విట్టర్ (Twitter) వేదికగా స్పందించారు.
బెంగళూర్ లో విపక్షాల కూటమి జరుగుతున్న సమయంలోనే బీజేపీ తన 38 మిత్రపక్షాల పార్టీలతో ఢిల్లీలో సమావేశం అయ్యింది.
Modi Satires On Opposition Parties| “విపక్షాల కూటమి అవినీతి (Corruption), కుటుంబ రాజకీయాలతో (Dynasty Politics) నిండిపోయింది” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.