Nara Lokesh Thanks Telangana Govt. | హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో మరమ్మత్తులు పనులు జోరందుకున్నాయి. ఘాట్ ముఖద్వారం నుంచి స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సమాధి వరకు అన్నింటినీ నవీకరిస్తున్నారు.
అయితే ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఘాట్ కు వచ్చిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కట్టడాలు దెబ్బతినడం, గ్రిల్స్ పడిపోవడం పై అసహనం వ్యక్తం చేశారు. అవసమైతే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరమ్మత్తులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాయాలని సూచించారు.
ఈ నేపథ్యంలో హెచ్ఎండిఏ స్పందించింది. ఎన్టీఆర్ ఘాట్ లో సుమారు రూ.1.3 కోట్ల వ్యయంతో మరమత్తుల పనులను ప్రారంభించింది. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ స్పందించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదం.. మహా నాయకుడు ఎన్టీఆర్ స్మృతివనం అయిన ఎన్టీఆర్ ఘాట్‌కు రూ.1.35 కోట్ల వ్యయంతో హెచ్ఎండిఏ మరమ్మతులు చేపట్టడం చాలా సంతోషమన్నారు.
ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు లోకేష్ పోస్ట్ చేశారు.










