Nara Lokesh News Latest | “అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం” సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
డ్రగ్స్ వద్దు బ్రో అని ఆయన పిలుపునిచ్చారు. యువత మాదక ద్రవ్యాలను తిరస్కరించి, తమ శక్తిని తమకు మరియు సమాజానికి మంచి భవిష్యత్తును నిర్మించడానికి ఉపయోగించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో, మాదక ద్రవ్యాల ముప్పును కట్టడి చేయడానికి కూటమి ప్రభుత్వం ద్వారా ‘ది ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్’ (EAGLE) ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
డ్రగ్స్ ఫ్రీ సమాజం కోసం అందరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వద్దు బ్రో అంటూ హాష్ ట్యాగ్ ను జత చేశారు.










