Tuesday 31st March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > “మీ బాధ్యత నాది.. జీవితాంతం అండగా ఉంటా: నారా లోకేశ్

“మీ బాధ్యత నాది.. జీవితాంతం అండగా ఉంటా: నారా లోకేశ్

nara lokesh

Nara Lokesh Helps TDP Activist Family | తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలర్పించిన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవడంలో తానేప్పుడూ ముందుంటానని మంత్రి నారా లోకేశ్ మరోసారి నిరూపించుకున్నారు.

గత ఏడాది విద్యుత్ ప్రమాదంలో దుర్మరణం చెందిన కర్నూలు జిల్లా మునగాలపాడుకు చెందిన పార్టీ కార్యకర్త ఎమ్. అర్జున్ కుటుంబానికి ఆయన అభయమిచ్చారు.

“మీ కుటుంబ బాధ్యత ఇకపై నాది.. జీవితాంతం మీకు అండగా ఉంటాను” అంటూ ఆ కుటుంబంలో ధైర్యం నింపారు.

మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి అర్జున్ కుటుంబ సభ్యులను మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అర్జున్ తల్లిదండ్రులు మద్దిలేటి, రాణి మరియు సోదరి కోమలితో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.

అర్జున్ అకాల మరణం పట్ల తన విచారాన్ని వ్యక్తం చేస్తూ, ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అర్జున్ సోదరి కోమలి విద్యాభ్యాసం గురించి ఆరా తీసిన లోకేశ్, ఆమె ఉన్నత చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పూర్తి బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు.

కర్నూలు జిల్లాకు చెందిన ఉత్సాహవంతుడైన కార్యకర్త ఎమ్. అర్జున్, గతేడాది నన్నూరు సమీపంలో జరిగిన ఒక  విద్యుత్ ప్రమాదంలో మరణించారు.

కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబం గురించి తెలుసుకున్న లోకేశ్, వారిని పరామర్శించి భవిష్యత్తుపై నమ్మకాన్ని కల్పించారు.

 పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యుడే. కష్టకాలంలో వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.అని హామి ఇచ్చారు నారా లోకేశ్.

మంత్రి లోకేశ్ చూపిన ఉదారతకు అర్జున్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. తమ లాంటి సామాన్య కార్యకర్త కుటుంబాన్ని గుండెలకు హత్తుకున్నందుకు వారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

You may also like
nara lokesh
‘రూ. లక్ష చెప్పులు వేసుకునే వాడు పేదవాడుఎలా అవుతాడు’
lokesh and jagan
‘ఆ డ్రెస్ ఉతికించి పెట్టికో..’ ఏపీ సీఎం జగన్ పై లోకేశ్ సెటైర్లు!
jr ntr
Next CM NTR.. ఒంగోలులో తారక్ ఫ్లెక్సీల కలకలం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions