Nara Lokesh As Deputy CM ?| ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) ను డిప్యూటీ సీఎం చేసి ఎలివేట్ ( Elevate ) చేయాల్సిన సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి.
కాగా వైఎస్సార్ జిల్లా మైదుకూరు లో నిర్వహించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ( Nandamuri Taraka Rama Rao ) వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి మూడో తరం నాయకుడు నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేస్తే పార్టీలోని యువతకు భరోసా ఉంటుందని ఆయన చెప్పారు. దీనివల్ల పార్టీకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
గత కొన్నిరోజులుగా నారా లోకేష్ కు డిప్యూటీ సీఎంగా పదోన్నతి ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇలా చేయడం ద్వారా నారా లోకేష్ ఎలివేట్ అవ్వడమే కాకుండా, పార్టీకి కూడా మంచి భవిష్యత్ ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.









