Nagababu On Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి జనసేన నాయకులు నాగబాబు ఆసక్తికరమైన పోస్టును షేర్ చేశారు.
ప్రధాని మోదీ పిలుపుమేరకు జనసేనాని పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు నాగబాబు పేర్కొన్నారు.
తాజగా వెలువడిన ఫలితాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన స్థానాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. మహారాష్ట్ర లో ఘనవిజయంతో భారతదేశం లో బిజెపి మార్క్ మరింత బలపడిందని తెలిపారు.
అలాగే ‘ గెలిచే ప్రతి నాయకుడు హీరోనే, కాని ప్రతి హీరో నాయకుడు కాలేడు..
నాయకుడంటే గెలిచే వాడే కాదు..నమ్మిన సిద్ధాంతాల కోసం సైధ్దాంతిక విలువల కోసం
అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం నీడై నిలబడేవాడు, తోడై నడిపించేవాడు, వారి గమ్యంలో గెలుపుని చూసుకునే వాడు, వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునే వాడు, అలాంటి అరుదైన నాయకుడే నా నాయకుడు The Political Game Changer Of Current Indian Politics ‘పవన్ కళ్యాణ్’ ‘ అంటూ నాగబాబు కితాబిచ్చారు.