Naga Chaitanya Wants To Join Lokesh Kanagarajan’s LCU | అక్కినేని నాగ చైతన్య ( Naga Chaitanya ), సాయి పల్లవి ( Sai Pallavi ) జంటగా చందు మొండేటి ‘తండేల్’ మూవీని తెరకెక్కించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో మూవీ టీం వివిధ కార్యక్రమాలతో ప్రచారం చేస్తుంది. ఇందులో భాగంగా చెన్నైలో తాజగా తండేల్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో నటుడు కార్తీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాగ చైతన్య తనకు లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ ( Lokesh Cinematic Universe ) లో భాగం కావాలని ఉందన్నారు. విక్రమ్, లియో వంటి సినిమాలతో దర్శకుడు లోకేశ్ మంచి విజయాన్ని అందుకున్నారు.
అలాగే LCU లో భాగంగా మరిన్ని సినిమాలు వస్తాయని ఆయన గతంలోనే చెప్పారు. దింతో ఈ యూనివర్స్లో భాగం కావాలని నాగ చైతన్య మనసులోని మాటను వెలిబుచ్చారు.
నటుడు కార్తీ మాట్లాడుతూ చైతన్య, సాయి పల్లవిల యాక్టింగ్ ను అభినందించారు. సాయి పల్లవి స్టోరీ సెలక్షన్ అద్భుతమని కితాబిచ్చారు.