Naga Chaitanya Cooks Fish Curry For Fisherman | నటుడు నాగ చైతన్య ( Naga Chaitanya ) షూటింగ్ స్పాట్ ( Shooting Spot ) లో చేపల పులుసు వండారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
నాగ చైతన్య కథానాయకుడిగా చందు మొండేటి తెరక్కెక్కిస్తున్న చిత్రం ‘తండేల్’ ( Thandel ). ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. మూవీ షూటింగ్ ఎక్కువ భాగం ఉత్తరాంధ్రలో జరిగింది. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖపట్నంలో చిత్రీకరణ జరిగిన విషయం తెల్సిందే.
ఈ క్రమంలో స్థానికులతో నాగ చైతన్య మాట్లాడారు. చేపల పులుసు చేసి పెడతానని వారికి మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఓ రోజు మత్స్యకారులు, స్థానికుల కోసం చేపల పులుసు వండి వడ్డించారు.
నాగ చైతన్య చేతి వంటపై వారు సంతోషం వ్యక్తం చేశారు. తమలా మారెందుకు నాగ చైతన్య ఎంతో శ్రమించారని స్థానిక మత్స్యకారులు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను మూవీ యూనిట్ తాజగా షేర్ చేసింది.