Murali Mohan Responce To Hydra Notice | హైడ్రా జారీ చేసిన నోటీసులపై ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మురళి మోహన్ ఆదివారం స్పందించారు.
కాగా ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువు బఫర్ జోన్ లో మురళి మోహన్ కు చెందిన జయభేరి నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టినట్లు హైడ్రా నోటీసులు ఇచ్చింది. వాటిని కూల్చేయాలని 15 రోజుల సమయం హైడ్రా ఇచ్చింది.
దింతో జారీ అయిన నోటీసులపై మురళి మోహన్ స్పందిస్తూ..తాను గత 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నట్లు, ఎప్పుడూ ఎలాంటి ఆక్రమణలు చేపట్టలేదని తెలిపారు.
బఫర్ జోన్ లో మూడు అడుగుల మేర రేకుల షెడ్ ఉందని వాటికే హైడ్రా నోటీసులు ఇచ్చినట్లు మురళి మోహన్ వివరణ ఇచ్చారు.
రేకుల షెడ్ కూల్చివేతకు హైడ్రా రావాల్సిన అవసరం లేదని, వాటిని తానే కూల్చివేస్తానని ఆయన స్పష్టం చేశారు.