Mohan Babu Gets Interim Relief From Telangana High Court | వరుస ఉద్రిక్త ఘటనల అనంతరం మంచు మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్ లభించింది. మంగళవారం హైదరాబాద్ జల్ పల్లి లోని ఆయన నివాసం వద్ద హై డ్రామా నెలకొన్న విషయం తెల్సిందే.
గేట్లు తోసుకుంటూ మనోజ్ ( Manchu Manoj ) ఇంట్లోకి దూసుకెళ్లడం, అనంతరం తనపై దాడి జరిగినట్లు మీడియా ముఖంగా మనోజ్ చెప్పడం ఇంతలోనే అక్కడికి వచ్చిన మోహన్ బాబు మీడియా ప్రతినిధి పై భౌతిక దాడి చేయడం తీవ్ర వివాదంగా మారింది.
ఈ ఘటన అనంతరం మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. కుటుంబ వివాదం నేపథ్యంలో బుధవారం రాచకొండ సీపీ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు ఇచ్చారు.
అయితే నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు హై కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది.
పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు డిసెంబర్ 24 వరకు మినహాయింపు ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.