Misha Agarwal died by suicide after losing social media followers | ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ మిషా అగర్వాల్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తగ్గడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
తన 25వ పుట్టినరోజు కంటే రెండు రోజుల ముందు ఏప్రిల్ 24న ఆత్మహత్య చేసుకుంది. మిషా ఇన్‌స్టాగ్రామ్‌లో 3.5 లక్షల మంది ఫాలోవర్లతో పాటు, మిష్ కాస్మెటిక్స్ అనే సొంత కాస్మెటిక్స్ బ్రాండ్‌ను కూడా నడుపుతూ మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలో ఆమె సూసైడ్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తాజగా మిషా అగర్వాల్ మరణానికి సంబంధించిన వివరాలను ఆమె సోదరి ముక్తా అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. మిషా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య తగ్గడంతో తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉందని, ఒక మిలియన్ ఫాలోవర్లను సాధించాలనే లక్ష్యంతో ఆమె తన కెరీర్‌ను పూర్తిగా సోషల్ మీడియాకే అంకితం చేసినట్లు ముక్తా వెల్లడించారు.
ఫాలోవర్ల సంఖ్య తగ్గడంతో మిషా తన విలువ కోల్పోయినట్లు భావించిందని ఏప్రిల్ నుంచి ఆమె తీవ్ర నిరాశ, ఒత్తిడిలోకి వెళ్లినట్లు చెప్పారు. తనను గట్టిగా కౌగిలించుకుని మిషా ఏడ్చేదని సోదరి తెలిపారు. లా డిగ్రీ పొంది, జ్యుడీషియల్ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పటికీ, సోషల్ మీడియాతోనే సక్సెస్ కావాలని మిషా భావించేదని ఈ క్రమంలో ఫాలోవర్లు తగ్గడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సోదరి ముక్త ఒక పోస్ట్ చేశారు.









