Saturday 28th February 2026
12:07:03 PM
Home > తాజా > ఎంజీబిఎస్ బస్టాండ్ లో వరద నీరు..ఆర్టీసీ కీలక నిర్ణయం

ఎంజీబిఎస్ బస్టాండ్ లో వరద నీరు..ఆర్టీసీ కీలక నిర్ణయం

MGBS flooded as Musi swells | మూసీ న‌దికి భారీ వ‌ర‌ద నేప‌థ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగ‌ణంలోకి వ‌ర‌ద నీరు చేరిన విషయం తెల్సిందే. దీంతో ఎంజీబీఎస్ బ‌స్ స్టేష‌న్ నుంచి బ‌స్సుల రాక‌పోక‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది.

ఎంబీజీఎస్ నుంచి బ‌య‌లుదేరే బ‌స్సుల‌ను హైద‌రాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ న‌డుపుతోంది. మూసీ వ‌ర‌ద‌నీరు చేరిన నేప‌థ్యంలో ఎంజీబీఎస్ కు ప్ర‌యాణికులు ఎవ‌రూ రావొద్ద‌ని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞ‌ప్తి చేస్తోంది. ఎంబీజీఎస్ నుంచి న‌డిచే బ‌స్సుల‌ను ఇత‌ర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామ‌ని, ఆయా మార్గాల ద్వారా త‌మ గమ్య‌స్థానాల‌కు చేరుకోవాల‌ని పేర్కొంది.

ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే స‌ర్వీసులు జేబీఎస్ నుంచి న‌డుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ వైపున‌కు వెళ్లేవి ఉప్ప‌ల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తున్నాయి. సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ, విజ‌య‌వాడ వైపున‌కు బ‌స్సులు ఎల్బీన‌గ‌ర్ నుంచి న‌డుస్తున్నాయి. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, క‌ర్నూల్, బెంగ‌ళూరు వైపున‌కు వెళ్లే స‌ర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి.

You may also like
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!
GHMC చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం
బల్కంపేట ఆలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ..అధికారులపై వేటు
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..స్పందించిన పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions