Chiranjeevi Wishes Revanth | తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా గురువారం నాడు ప్రమాణస్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. దీంతో తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సిఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా మాజీ కేంద్ర మంత్రి, సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.
‘తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కి శుభాభినందనలు, మీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా.
అలాగే డిప్యూటీ సిఎం గా ప్రమాణ స్వీకారం చేసిన భట్టి విక్రమార్కకు, మంత్రివర్యులకు, సీఎల్పీ నేతలకు శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.









