Medaram Jampanna Vagu | ములుగు జిల్లా మేడారంలో ప్రతీ రెండేళ్లకు ఒకసారి సమ్మక్క-సారలమ్మ జాతర ఘనంగా జరుగుతుందనే విషయం తెల్సిందే. ఇక్కడే ఉన్న జంపన్న వాగుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఈ వాగులో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. కేవలం జాతర సమయంలోనే కాకుండా మాములు రోజుల్లో కూడా వేల సంఖ్యలో భక్తులు మేడారం వెళ్తుంటారు. అలాగే జంపన్న వాగులో స్నానమాచారిస్తారు. ఈ నేపథ్యంలో జంపన్న వాగు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది.
జంపన్న వాగు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మంత్రి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం జంపన్న వాగు రివర్ ఫ్రoట్ అభివృద్ధికి రూ.5 కోట్లు విడుదల చేసింది.










