Marriage Discussion: Suma Tricks Prabhas! | తాను పెళ్లి చేసుకోవాలని అనుకునే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో తెలికే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని ఫన్నీగా కామెంట్ చేశారు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్-దర్శకుడు మారుతీ కాంబోలో తెరకెక్కిన ‘ది రాజాసాబ్’ జనవరి 9న విడుదల కానుంది. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుక జరిగింది. ఇందులో ప్రభాస్ అభిమానులు సందడి చేశారు. హీరోపై తమ అభిమానాన్ని చాటుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందులో ఓ అభిమాని ‘ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి’ అని ప్లకార్డును ప్రదర్శించారు.
దీని గురించి యాంకర్ సుమ ప్రభాస్ ను ప్రశ్నించగా ఆయన సరదాగా జవాబు చెప్పారు. ఆ క్వాలిటీస్ తెలియకే ఇంకా పెళ్లి చేసుకోలేదని ఫన్నీగా చెప్పారు. దింతో అక్కడున్న వారు నవ్వుకున్నారు. ఇకపోతే ఈవెంట్ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ..సుధీర్ఘ కాలం తర్వాత వినోదంతో కూడిన సినిమాను చేసినట్లు చెప్పారు. ‘సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి, సీనియర్లు ఎప్పటికైనా సీనియర్లే, వారి నుంచే మేము నేర్చుకున్నాము’ అని ప్రభాస్ పేర్కొన్నారు. సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని, రాజాసాబ్ కూడా హిట్ అయితే మరింత సంతోషం అని అన్నారు.








