Manchu Manoj’s heartfelt birthday wish to Mohan Babu | మంచు కుటుంబంలో గత కొన్ని నెలలుగా వివాదాలు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తండ్రి మంచు మోహన్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మంచు మనోజ్.
‘హ్యాపీ బర్త్ డే నాన్న. పుట్టినరోజు వేడుకల్లో మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాం. మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్న. లవ్ యూ’ అంటూ మనోజ్ పేర్కొన్నారు. ఈ మేరకు నా సూర్యుడివి, నా చంద్రుడివి అనే పాటతో తండ్రిపై ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు.
అయితే వివాదాల నేపథ్యంలో గతంలో మనోజ్ పై మోహన్ బాబు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. తన ఇంట్లో మనోజ్ అక్రమంగా ఉంటున్నాడని, తన ఆస్తులను ఆక్రమించడాని ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. మనోజ్ సైతం సోదరుడు మంచు విష్ణుపై మీడియా ద్వారా మరియు సోషల్ మీడియాలో హాట్ కామెంట్స్ తో విరుచుకుపడ్డ విషయం తెల్సిందే.