Mancherial Teacher | పాఠాన్ని విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యేలా బోధించాలనే లక్ష్యంతో ఓ ఉపాధ్యాయుడు చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది.
మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భీంపుత్ర శ్రీనివాస్ సైన్స్ టీచర్ గా పని చేస్తున్నారు. సోమవారం ఆయన పంచకట్టుకుని పాఠశాలకు వచ్చారు. మాస్టారి వస్త్రాధారణ ప్రతీరోజు కంటే భిన్నంగా ఉంది. అనంతరం ఆయన ఐదవ తరగతి గదిలోకి వెళ్లారు.
అక్కడ పంచె, చొక్కా తీసేశారు. అయితే లోపల ఉన్న దుస్తువులను చూసి అంతా అవాక్కయ్యారు. మానవ శరీర భాగాలను ముద్రించి ఉన్న వస్త్రాన్ని ఆయన ధరించారు. అనంతరం క్లాస్ తీసుకున్నారు. మానవ శరీరంలో అవయవాలు ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అవి చేసే పనులు ఏంటి అని విద్యార్థులకు బోధించారు.
టీచర్ కళ్ళకు కట్టినట్టు పాఠాలు చెప్పడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కాగా భీంపుత్ర శ్రీనివాస్ వినూత్న ఆలోచన వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ స్పందించారు.
రేపటి దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులకు సృజనాత్మకంగా, అంకితభావంతో బోధిస్తున్న శ్రీనివాస్ ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.









