Mana ShankaraVaraprasad Garu Box Office Collections | మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. జనవరి 12న విడుదలైన ఈ సినిమా థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే రూ.120 కోట్లు వసూలు చేసి బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 48 గంటల్లోనే బుక్ మైషో లో 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవ్వడం విశేషం. తొలి రోజు రూ.84 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండవ రోజు కూడా అద్భుత కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.
రెండు రోజులు కలిపి రూ.120 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకున్నట్లు, ఈ మూవీ మెగా బ్లాక్ బస్టర్ గా నిలిచిందని మేకర్స్ ప్రకటించారు. మూడవ రోజు కూడా దిగ్విజయంగా ఈ సినిమా కొనసాగుతుంది. బుక్ మైషో వెల్లడించిన నివేదిక ప్రకారం ప్రతీ గంట కొన్ని వేల టికెట్లు అమ్ముడవుతున్నాయి. అత్యధికంగా ఒక గంటలో 30వేలకు పైగా టికెట్లు అమ్ముడయినట్లు బుక్ మై షో పేర్కొంది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి, రూ.100 కోట్లు వసూలు చేసిన తన ఆరవ చిత్రం అని హర్షం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే.









