Man , upset at his dog’s desth , Ends life | బెంగళూరులో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేని యజమాని తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే నగరానికి చెందిన రాజశేఖర్(33) అనే వ్యక్తి నగరంలోని హెగ్గడదేవనపురలో నివాసం ఉంటున్నాడు.
ఇతను కొంత కాలంగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. దానికి బౌన్సీ అని పేరు పెట్టి సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకుంటున్నాడు. అయితే ఇటీవల అది అనారోగ్యంతో చనిపోయింది.
దీంతో ఖననం చేసిన అనంతరం ఇంటికి వచ్చిన రాజశేఖర్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తను ఆప్యాయంగా పెంచుకున్న బౌన్సీ మరణాన్ని తట్టుకోలేకపోయాడు. ఆ బాధతో కుక్కకు ఉపయోగించిన చైన్‌తోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.