Man seriously injured after wild elephant attack while taking selfie in Bandipur | సెల్ఫీ తీసుకోవాలని భావించిన ఓ పర్యాటకుడిపై ఏనుగు తీవ్రంగా దాడి చేసింది.
ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం చామరాజనగర లోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కేరళ నుంచి వచ్చిన ఓ పర్యాటకుడు సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించాడు. ఇంతలోనే ఏనుగు పర్యాటకుడిపై దాడి చేసేందుకు పరుగుతీసింది.
దాని నుండి తప్పించుకోవాలని సదరు వ్యక్తి ప్రయత్నించినా ఏనుగు మాత్రం వదలలేదు. పారిపోతున్నా వదలకుండా అతన్ని కాళ్ళతో తొక్కి దాడి చేసింది. అదృష్టవశాత్తూ పర్యాటకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెంటనే స్థానికులు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.









