Maharastra Assembly Elections Exit Polls | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం సాయంత్రంతో ముగిశాయి.
అధికార బీజేపీ ( BJP ), శివసేన ( Shivasena ), ఎన్సీపీ ( NCP ) కూటమి మహాయుతి, ప్రతిపక్ష కాంగ్రెస్ ( Congress ), శివసేన ఉద్ధవ్ ( Shivasena UBT ), ఎన్సీపీ శరద్ పవార్ ( NCP Sharad Pawar ) మహా వికాస్ అఘాడీ కూటముల మధ్య హోరాహోరీగా తలపడ్డాయి. ఎన్నికలు ముగియడంతో ఏక్సిట్ పోల్స్ వెలువడుతున్నాయి.
ఇందులో మహారాష్ట్రలో మరోసారి అధికార మహాయుతి కూటమి అధికారాన్ని కైవసం చేసుకొనున్నట్లు సర్వేలు వెల్లడించాయి. పీపుల్ పల్స్ సర్వే ప్రకారం బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి 182, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమికి 97 మరియు ఇతరులకు 9 సీట్లు వస్తాయని అంచనా వేశారు.
మహాయుతిలో బీజేపీ, మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్ పార్టీలు అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటాయని సర్వేలు వెల్లడించాయి. కాగా మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి.