KTR Open Letter To Cm Revanth Reddy | ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేయబోతున్నారని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది.
ఈ క్రమంలో కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖను రాశారు. దమ్ముంటే ఫార్ములా ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తనపై కేసు నమోదు చేస్తామని, గవర్నర్ నుండి అనుమతి వచ్చిందని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి లీకులు ఇస్తున్నారని పేర్కొన్నారు.
నాలుగు గోడల మధ్య కాకుండా అసెంబ్లీలో చర్చ పెడితే ప్రజలకు నిజానిజాలు తెలుస్తాయన్నారు. రాష్ట్రానికి, హైదరాబాద్ కు మంచి జరగాలనే ఉద్దేశ్యంతోనే ఫార్ములా ఈ రేస్ నిర్వహికులతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఈ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగినట్లు తెలిపారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేదన్నారు. కేవలం రాజకీయ కక్షలో భాగంగానే నగరానికి మంచి చేసే ఈ రేస్ ను బలి చేశారని రేవంత్ సర్కారుపై కేటీఆర్ ధ్వజమెత్తారు.










