KTR On Allu Arjun Arrest | పుష్ప-2 ( Pushpa-2 The Rule ) బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన విషయం తెల్సిందే.
ఈ కేసుకు సంబంధించి శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
అల్లు అర్జున్ అరెస్ట్ ను ఆయన ఖండించారు. జరిగిన ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను నేరస్తుడిగా ట్రీట్ చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. నేషనల్ అవార్డు విన్నర్ అయిన అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం పాలకుల అభద్రతాభావాన్ని తెలియజేస్తుందన్నారు.
హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకి బాధ్యుడైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనల్లో గాయపడిన వారికి న్యాయం జరగాలి కాని ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు.