KTR News Latest | ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా శుక్రవారం సిట్ విచారణకు హాజరయ్యారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణలో సిట్ అధికారులకు పూర్తిగా సహకరించినట్లు చెప్పారు. అడిగిన ప్రశ్నలనే పదే పదే అడుగుతూ సమయం వృధా చేశారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారా అని తానే అధికారులను అడగగా మాకు సంబంధం లేదు, తెలీదు అని అధికారులు చెప్పినట్లు పేర్కొన్నారు.
సిట్ విచారణలో భాగంగా ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులను తన ఎదుట కూర్చోబెట్టి అధికారులు ప్రశ్నించినట్లు వచ్చిన కథనాలను కేటీఆర్ ఖండించారు. అక్కడ పోలీసులు, తారకరామారావు తప్ప మరే రావు లేరని స్పష్టం చేశారు. హీరోయిన్ల పేరుతో దుష్ప్రచారం ఎందుకు చేశారని సిట్ అధికారులను ప్రశ్నించగా తాము అలా మీడియాకు చెప్పలేదని అధికారులు చెప్పారని కేటీఆర్ తెలిపారు.










