KTR Appears Before ED | బీఆరెస్ ( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఉదయం ఈడీ ( Enforcement Directorate ) విచారణకు హాజరయ్యారు.
ఫార్ములా ఈ కార్ రేస్ ( Formula E Car Race ) కేసుకు సంబంధించి బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయం ఎదుట కేటీఆర్ హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసులు ఈడీ ఆఫీసు ముందు బారి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముందు జాగ్రత్తగా బాష్పవాయువు, వాటర్ కెనాన్ల వాహనాలతో సుమారు 200మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఈడీ కార్యాలయానికి బీఆరెస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
అలాగే బీఆరెస్ నేత మన్నె క్రిశాంక్ ( Manne Krishank ) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ ( Quash ) చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించిన విషయం తెల్సిందే.
దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా ‘డిస్మిస్డ్ యాజ్ విత్ డ్రాన్’ ( Dismissed as withdrawn ) గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.