Thursday 29th January 2026
12:07:03 PM
Home > తాజా > ‘కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల జూరాల ప్రాజెక్టు డేంజర్ లో’

‘కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల జూరాల ప్రాజెక్టు డేంజర్ లో’

KTR About Jurala Project | జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడం కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని మండిపడ్డారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

ఒక్క ఇటుక పేర్చడం కూడా చేతకాని ముఖ్యమంత్రికి కనీసం ఉన్న ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం వల్లే ఇవాళ జూరాల ప్రాజెక్టు డేంజర్ లో పడిందని ధ్వజమెత్తారు. ప్రతిఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్ వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో రేవంత్ సర్కారు నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు గుప్పించారు.

జూరాలకు క్రమంగా వరద ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలన్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల ఎస్.ఎల్.బీ.సీ. టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని నిలదీశారు.

పెద్దవాగుకు గండిపడి 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, వట్టెం పంప్ హౌజ్ మునిగిపోయింది, సుంకిశాల రిటేనింగి వాల్ కుప్పకూలి వందల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

ప్రభుత్వం వెంటనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు, ఎగువ నుంచి పెరుగుతున్న ఇన్ ఫ్లో ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

You may also like
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’
తల్లి పుట్టినరోజు..జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions