Sunday 27th April 2025
12:07:03 PM
Home > తాజా > బీరు బిర్యానీ వ్యాఖ్యలు..మరో వివాదంలో కొండా సురేఖ

బీరు బిర్యానీ వ్యాఖ్యలు..మరో వివాదంలో కొండా సురేఖ

Konda Surekha News Latest | మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే అక్కినేని నాగచైతన్య-సమంత ( Naga Chaitanya-Samantha )విడాకులపై సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కాంట్రావెర్సీ ( Controversy )కి దారి తీసిన విషయం తెల్సిందే.

ఆమె వ్యాఖ్యల నేపథ్యంలో నటుడు అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) పరువునష్టం దావా సైతం వేశారు.

మరోవైపు తాజగా ఆమె ఇన్స్టాగ్రామ్ లైవ్ ( Instagram Live ) లో చేసిన వ్యాఖ్యలు నెట్టింటి వైరల్ గా మారాయి. కూతురు సుష్మిత పటేల్ తో ఆమె ఇన్స్టా లైవ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ‘ ఈరోజు ఇంట్లో అందరికీ పండుగ ఉంది. చిన్నపాప పేరు మీద బిర్యానీలు తెప్పిస్తున్నాం. బిర్యానీ ఉంటే బీరు ఉంటుంది కదా పాపం ‘ అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.

అలాగే మరో వీడియోలు ఎవరు ఎక్కువ డాన్స్ ( Dance ) చేస్తే వారికి ఎక్కువ మందు అంటూ మాట్లాడారు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు వైరల్ ( Viral ) గా మారాయి. మంత్రి వ్యాఖ్యల పట్ల బీఆరెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

You may also like
‘క్రమశిక్షణతో భరిస్తున్నాం..పిఠాపురం వర్మ సంచలనం’
‘సింధూలో పారేది రక్తమే..పాక్ నేతల పిచ్చి మాటలు’
‘పాకిస్థాన్ అమ్మాయితో పెళ్లి ఖరారు..ఇంతలోనే’
‘కరుంగాలి కంబు’తో పవన్ కళ్యాణ్ ను సత్కరించిన తమిళనాడు నేత

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions