Komatireddy Counter To CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని మరోసారి తప్పుబట్టారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఇటీవల ముఖ్యమంత్రి సోషల్ మీడియా జర్నలిస్టులపై విరుచుకుపడ్డ విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదని హితవుపలికారు.
‘తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు.’ అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.









