Kodali Nani Comments | టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prasant Kishore)ల భేటీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani).
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఔట్ డేటెడ్ పొలిటీషన్ అనీ, ఎంతమందిని పీకేలను తన వెంట పెట్టుకున్నా సీఎం జగన్ (CM Jagan)ను ఓడించలేరని స్పష్టం చేశారు.
అలాగే ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ వాడి వదిలేసిందనీ, ఆయన బుర్రలోని గుజ్జంతా అయిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిషోర్ వైసీపీ కి పని చేసిన సమయంలో ఇదే చంద్రబాబు, లోకేష్ లు విమర్శలు చేశారని గుర్తు చేశారు.
వివేకా హత్య, కోడి కత్తి ఘటనలు పీకే ప్లాన్ లో భాగంగానే జరిగినట్లు టీడీపీ నేతలు ఆరోపించారని తెలిపారు. మరి ఇప్పుడు చంద్రబాబు గొంతు కోయడానికి నారా లోకేష్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని ప్రశ్నించారు కొడాలి.
ప్రశాంత్ కిషోర్ కు ఐ పాక్ టీం కు సంబంధం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా టీడీపీ ని ఇండియా కూటమిలో చేరమని చెప్పడానికి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్ ను పంపించిందని వ్యాఖ్యానించారు నాని.