KL Rahul to lead India vs South Africa | సౌత్ ఆఫ్రికాతో నవంబర్ 30 నుంచి మూడు వన్డేల సిరీస్ మొదలుకానుంది. ఈ క్రమంలో టీం ఇండియాకు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది బీసీసీఐ. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ కొనసాగనుంది. అయితే తొలి టెస్టులో గాయం కారణంగా శుభమన్ గిల్ మైదానాన్ని వీడిన విషయం తెల్సిందే.
దింతో కేఎల్ రాహుల్ ను వన్డే సిరీస్ కోసం కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ. ఇకపోతే బుమ్రా, సిరాజ్ లకు రెస్ట్ ఇవ్వగా, గిల్, శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా వన్డే సిరీస్ కు దూరం అయ్యారు. యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ కు అవకాశం దక్కింది. రోహిత్ శర్మ, జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ధృవ్ జురెల్ తో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.
నవంబర్ 30న రాంచీ వేదికగా, డిసెంబర్ 3న రాయపూర్, డిసెంబర్ ఆరున వైజాగ్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో మూడు వన్డే మ్యాచులు జరగనున్నాయి. ఇకపోతే గిల్ మెడ నొప్పితో ఉండడంతో అతడి స్థానంలో రిషబ్ పంత్ రెండవ టెస్టులో కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.









