- కిటోలిట్ సంస్థ ఆధ్వర్యంలో ఫెస్ట్
- ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
Kitolit Robotic Fest In Exceed School | సాంకేతిక రంగంలో చిన్నారుల సృజనాత్మకతను వెలికితీసే లక్ష్యంతో మణికొండలోని ఎక్సీడ్ స్కూల్ (Exceed School) లో ‘రోబో టెక్కీస్ ఫెస్ట్’ (ROBO TECHIES FEST) ఘనంగా నిర్వహించారు. “కిటోలిట్” (KiTOLiT) సంస్థ సహకారంతో జరిగిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు తాము స్వయంగా రూపొందించిన వినూత్న రోబోలను ప్రదర్శించి సందర్శకులను అబ్బురపరిచారు.
“లెర్న్ బై డూయింగ్” (Learn by Doing) అనే నినాదంతో సాగిన ఈ కార్యక్రమం భవిష్యత్తు ఇంజనీర్ల మేధస్సుకు ఒక చక్కని వేదికగా నిలిచింది. ఈ ప్రదర్శనలో చిన్నారులు తయారు చేసిన రోబోటిక్ కార్లు, సెన్సార్లతో పనిచేసే యంత్రాలు మరియు మెకానికల్ మోడల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే సైన్స్ మరియు టెక్నాలజీపై ఆసక్తిని పెంచేందుకు ఇటువంటి ప్రయోగాత్మక ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని పాఠశాల యాజమాన్యం మరియు నిర్వాహకులు తెలిపారు.
పసి ప్రాయంలోనే సంక్లిష్టమైన సాంకేతికతను ఒడిసిపట్టి, రోబోలను తయారు చేస్తున్న చిన్నారి టెక్కీలను చూసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందనలతో ముంచెత్తారు.
మణికొండ పరిసర ప్రాంతాల నుండి అనేక మంది ఈ ప్రదర్శనను సందర్శించి చిన్నారుల ప్రతిభను కొనియాడారు.










