King Charles III Meets And Greets India’s Mens and Womens Cricket Teams In London | టీం ఇండియా పురుష, మహిళల జట్లు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న విషయం తెల్సిందే.
ఈ సందర్భంగా టీం ఇండియా ప్లేయర్లు బ్రిటన్ రాజు చార్లెస్-3 ని మంగళవారం కలిశారు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల, టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మహిళా జట్టు కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్, మెన్స్ టీం కెప్టెన్ శుభమన్ గిల్ మరియు ప్లేయర్లు రాజును కలిశారు.
లండన్ లోని క్లారెన్స్ గార్డెన్ హౌస్ లో ప్లేయర్లను కలిసిన కింగ్ చార్లెస్ వారితో ముచ్చటించారు. ఇంగ్లాండ్-టీం ఇండియా మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన మూడవ టెస్టు మ్యాచులో చివరి వరకు పోరాడిన టీం ఇండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్ హైలైట్స్ ను తాను చూసినట్లు ప్లేయర్లతో కింగ్ చార్లెస్ చెప్పారు.
అనంతరం బుమ్రా, గిల్, ప్రసీద్ కృష్ణ, అర్షదీప్ సింగ్ తదితర ఆటగాళ్లతో ఆయన ముచ్చటించారు. ఆ తర్వాత ప్లేయర్లతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.
రాజును కలిసిన నేపథ్యంలో కెప్టెన్ శుభమన్ గిల్ సంతోషం వ్యక్తం చేశారు. లార్డ్స్ టెస్టులో సిరాజ్ ఔట్ అయిన విధానంపై చాలా దురదృష్టకరమని, బంతి స్టంప్స్ ను తాకిన విధానాన్ని రాజు గుర్తుచేసుకున్నట్లు గిల్ చెప్పారు.










