Cm Revanth Reddy At Hussain Sagar | ఖైరతాబాద్ ( Khairatabad ) బడా గణేశుడి శోభాయాత్ర మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యింది. కమిటీ సభ్యులు హారతి ఇచ్చి శోభాయాత్రను ప్రారంభించారు.
ఈ రోజు మధ్యాహ్నం వరకు మహాగణపతి నిమర్జనం జరగనుంది. ఈ నేపథ్యంలో మహాగణపతి శోభాయాత్రలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
మరోవైపు వినాయకుడి విగ్రహాల నిమర్జన ఏర్పాట్లను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy )హుస్సేన్ సాగర్ కు చేరుకున్నారు. సీపీ సీవీ ఆనంద్ ( CV Anand ) నిమర్జన ఏర్పాట్ల గురించి సీఎంకు వివరించారు. ఖైరతాబాద్ బడా గణేష్ నిమర్జనం గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.