KCR Attends Telangana Assembly For Budget Session | మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. బుధవారం నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయిన విషయం తెల్సిందే.
తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ( Jishnu Dev Verma ) ప్రసంగించారు. అంతకంటే ముందు నందినగర్ లోని నివాసం నుండి బయలుదేరిన గులాబీ బాస్ అసెంబ్లీ కి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆరెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో కేసీఆర్ సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఇదిలా ఉండగా గవర్నర్ ప్రసంగంపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గవర్నర్ తో పచ్చి అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లా ఉందని ఎద్దేవా చేశారు.









